close

తాజా వార్తలు

Published : 14/11/2020 18:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో కొత్తగా 1,657 కరోనా కేసులు

బులెటిన్‌ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 79,823 కరోనా పరీక్షల నిర్వహించగా.. 1,657 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. ఏడుగురు బాధితులు మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,52,955కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,854 మంది కొవిడ్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 2,155 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,26,344కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,757 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 91,01,048 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. కరోనాతో కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన