టీఎస్‌లో కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 253 కేసులు
close

తాజా వార్తలు

Updated : 13/06/2020 21:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీఎస్‌లో కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 253 కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిత్యం 100కు తగ్గకుండా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 253 కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నిర్ధారణ అయిన కేసులు 4,737కు చేరాయి. ఇవాళ 8 మంది కరోనా మహమ్మారికి బలవగా.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 182కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,352 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా.. 2,203 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే 179 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో, జీహెచ్‌ఎంసీలో ఒక్క రోజులో నమోదైన కేసులతో పోల్చితే ఇవాళ నమోదైనవే అత్యధికం. రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో రాష్ట్రానికి చెందిన వారు 4,288 మంది ఉండగా.. 449 మంది ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని