ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు
close

తాజా వార్తలు

Updated : 22/10/2020 19:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 76,726 కరోనా పరీక్షల నిర్వహించగా.. 3,620 కొత్త కేసులు నమోదు కాగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,96,919కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,524 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 3,723 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,58,138కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,257 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 73,47,776 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

కరోనాతో అత్యధికంగా గుంటూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. చిత్తూరు, తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, కడప, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని