
తాజా వార్తలు
తెలంగాణలో 27 కేసులు.. 40కి చేరిన మరణాలు
హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 15 కేసులు నమోదు కాగా.. 12 మంది వలస కార్మికులు కరోనా బారిన పడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,661కి చేరింది. ఇవాళ కరోనా బారి నుంచి ఇద్దరు కోలుకోగా.. చికిత్స పొంది ఇళ్లకెళ్లినవారి సంఖ్య 1,013కు పెరిగిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 40కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 608 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 89 మంది కరోనా బారిన పడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రంలో వనపర్తి, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఎలాంటి పాజిటివ్ కేసులూ నిర్ధారణ కాలేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.