close

తాజా వార్తలు

Updated : 21/05/2020 21:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో ఒక్కరోజే ఐదుగురి మృతి

హైదరాబాద్‌: తెలంగాణలో ఇవాళ మరో 38 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. మరో 10 మంది వలస కార్మికులకు కరోనా సోకగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడ్డ వలస కార్మికుల సంఖ్య 99కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,699కి చేరింది. ఇవాళ ఒక్కరోజే కరోనాతో ఐదుగురు బాధితులు మృతి చెందగా.. ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 45కి చేరింది. ఇవాళ 23 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,036 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 618 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇప్పటివరకు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. అంతేకాకుండా గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నిర్ధారణ కాలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని