ఏపీలో 75 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
close

తాజా వార్తలు

Updated : 24/10/2020 17:12 IST

ఏపీలో 75 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,342 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 74,919 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,342 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,04,026కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,566 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 3,572 మంది కోలుకోగా.. రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,65,991కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,469 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 75,02,933 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో మరణించారు. అనంతపురం, తూర్పు గోదావరి, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. కడప, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని