24 గంటలు..77,028 పరీక్షలు.. 2,949 కేసులు
close

తాజా వార్తలు

Updated : 28/10/2020 20:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

24 గంటలు..77,028 పరీక్షలు.. 2,949 కేసులు

బులెటిన్‌ విడుదల చేసిన ఏపీ వైద్యారోగ్య శాఖ

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 77,028 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,949 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,14,774కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,643 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 3,609 మంది కోలుకోగా.. రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,81,509కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,622 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 77,73,681 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం, గంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున కరోనాతో మృతి చెందగా.. చిత్తూరు, తూర్పు గోదావరిలో ఇద్దరు చొప్పున, ప్రకాశం, విశాఖలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని