close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 21/03/2020 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విపణిలోకి మారుతీ అధునాతన డిజైర్‌

ధర రూ.5.89- 8.8 లక్షలు

దిల్లీ: అగ్రగామి వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ప్రముఖ కాంపాక్ట్‌ సెడాన్‌ మోడల్‌ డిజైర్‌లో అధునాతన వెర్షన్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.5.89- 8.8 లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. మాన్యువల్‌ వేరియంట్‌ ధర రూ.5.89- 8.28 లక్షలుగా, ఆటోమేటెడ్‌ గేర్‌ షిఫ్ట్‌ వేరియంట్‌ రూ.7.31- 8.8 లక్షలుగా ఉన్నాయి. ‘కాంపాక్ట్‌ సెడాన్‌ విభాగంలో 55 శాతం మార్కెట్‌ వాటా డిజైర్‌ సొంతం. ఇప్పటికే 20 లక్షలకు పైగా డిజైర్‌ వినియోగదారులు ఉన్నారు. 2020 డిజైర్‌లో కొత్త తరం కే- సిరీస్‌ ఇంజిన్‌ అందించాం. ఐఎస్‌ఎస్‌ టెక్నాలజీ, ప్రీమియం ఇంటిరీయర్‌ డిజైన్‌ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి’ అని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, అమ్మకాలు) శశాంక్‌ శ్రీవాస్తవా పేర్కొన్నారు. బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్‌తో తక్కువ ఉద్గారాలు, అధిక ఇంధన సామర్థ్యం లభిస్తాయి అన్నారు. మాన్యువల్‌ వేరియంట్‌ లీటర్‌కు 23.26 కి.మీ, ఆటోమేటెడ్‌ వెర్షన్‌ లీటర్‌కు 24.12 కి.మీ మైలేజీ ఇస్తాయని కంపెనీ తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.