విజయవాడలో కొత్త సంవత్సర వేడుకల్లేవ్‌!
close

తాజా వార్తలు

Updated : 29/12/2020 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయవాడలో కొత్త సంవత్సర వేడుకల్లేవ్‌!

అనుమతిలేదన్న సీపీ బత్తిన శ్రీనివాసులు

విజయవాడ: నూతన సంవత్సర వేడుకలకు విజయవాడలో అనుమతులు లేవని నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. ఇంట్లోనే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని నగర ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో కొవిడ్‌ రెండో దశ, కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ చెప్పారు. నగరంలోని బందరు రోడ్డులో జనాలు గుమిగూడడం, రోడ్లపై కేక్‌ కోయడం లాంటివి నిషేధించినట్లు తెలిపారు. 31న రాత్రి 10గంటల్లోగా నగరంలోని వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, ఇతర సంస్థల్లోనూ ఎలాంటి వేడుకలను నిర్వహించకూడదన్నారు.

ఇవీ చదవండి..

ఏపీలో తొలి స్ట్రెయిన్‌ కేసు నమోదు

కృష్ణా నదిలో ప్రమాదకర ప్రయాణం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని