close

తాజా వార్తలు

Published : 30/04/2020 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాలుగోరోజూ దూకుడు.. నిఫ్టీ 9800+

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ పరిణామాలు, కొవిడ్‌-19పై పోరులో రెమ్‌డెసివిర్‌ డ్రగ్‌తో సత్ఫలితాలు ఇస్తోందన్న వార్తలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. దీనికితోడు మే 4 తర్వాత కరోనా ప్రభావం లేని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. దీంతో నిఫ్టీ మళ్లీ తన 9,800 మార్కును దాటింది.

సెన్సెక్స్‌ 997.46 పాయింట్లు ఎగిసి 33,717.62 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 306.55 పాయింట్లు లాభపడి 9,859.90 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.11గా ఉంది. నిఫ్టీలో టాటా మోటార్స్‌, యూపీఎల్‌, ఓఎన్‌జీసీ, వేదంతా, హిందాల్కో షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌, సిప్లా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఫార్మా షేర్లు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాలు చవిచూశాయి.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని