close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120015851 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => pnWfdN-yV4A [video_short_link] => pnWfdN-yV4A [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-02 19:56:06.236751 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 03/02/2020 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

నిర్భయ దోషులు దేశ సహనాన్ని పరీక్షిస్తున్నారు!

దిల్లీ హైకోర్టులో తుషార్‌ మెహతా వాదనలు

దిల్లీ: ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు ‘నిర్భయ’ దోషులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని కేంద్రం తరఫు న్యాయవాది తుషార్‌ మెహతా అన్నారు. దోషులకు ఉరిశిక్ష అమలుపై పటియాలా కోర్టు స్టే విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. దోషులకు ఉరిశిక్ష ఆలస్యం కావడం వల్ల ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. వరుసగా పిటిషన్లు వేస్తూ ఈ నలుగురు దోషులూ దేశం యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారన్నారు. నిర్భయపై ఆ నలుగురు అమానవీయంగా వ్యవహరించిన దారుణం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని గుర్తు చేశారు. పవన్‌ గుప్తా అనే  దోషి ఇప్పటివరకు క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోలేదనీ.. కావాలనే ఆలస్యం చేస్తున్నాడని కోర్టుకు తెలిపారు.   

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న అమలు కావాల్సిన ఈ ఉరిశిక్షపై పటియాలా న్యాయస్థానం స్టే విధించడాన్ని తీహాడ్‌ జైలు అధికారులు, కేంద్ర హోంశాఖ దిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఉరిశిక్ష అమలుపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.