close

తాజా వార్తలు

Updated : 09/07/2020 20:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందుకోసమే ఆగస్టు 15కు వ్యాక్సిన్‌ అన్నాం!

భద్రత విషయంలో రాజీలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారి

దిల్లీ: ఆగస్టు 15లోపు కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను‌ అందుబాటులోకి తీసుకురావాలన్న అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక అధికారి రాజేశ్‌ భూషణ్‌ గురువారం స్పష్టత ఇచ్చారు. భద్రత విషయంలో  రాజీలేకుండా క్లినికల్‌ ట్రయల్స్‌కు వేగవంతంగా అనుమతులు లభించేందుకే అలా అన్నారని తెలిపారు. ‘డీజీ-ఐసీఎంఆర్‌ లేఖలో ఆపాదించని అంశాలను దయచేసి చూడొద్దు’ అని ఆయన కోరారు.

ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ పేరుతో కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15లోపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఐసీఎంఆర్‌ కొన్ని రోజులు ముందు పేర్కొంది. ఏదైనా ఒక వ్యాక్సిన్‌ రావాలంటే కనీసం 18 నెలలు పడుతుందని, ఇదెలా సాధ్యమవుతుందని చాలామంది సందేహాలు లేవనెత్తారు. మరికొందరు విమర్శించారు.

‘అలసత్వం ప్రదర్శించకుండా, భద్రత పరంగా రాజీలేకుండా వీలైనంత త్వరగా క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతులు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆ లేఖ రాశారు’ అని భూషణ్‌ అన్నారు. ‘భారత్‌ బయోటెక్‌, క్యాడిలా హెల్త్‌కేర్‌ వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నాయి. ఈ రెండూ జంతువుల మీద ప్రయోగాలు పూర్తి చేశాయి. ఒకటి, రెండో దశల క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం డీసీజీఐ అనుమతి ఇచ్చింది. త్వరలోనే వీటిని మొదలుపెడతారని ఆశిస్తున్నా’ అని ఆయన అన్నారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని