‘పలుచోట్ల కొవిడ్‌’.. ఆధారాల్లేవ్‌: హర్షవర్దన్‌
close

తాజా వార్తలు

Published : 18/10/2020 21:29 IST

‘పలుచోట్ల కొవిడ్‌’.. ఆధారాల్లేవ్‌: హర్షవర్దన్‌

దిల్లీ: కొవిడ్‌-19 మూలాలపై తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ ఇటీవల చైనా కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. గతేడాది ప్రపంచంలో పలు చోట్ల ఈ వైరస్‌ వెలుగు చూసిందని పేర్కొంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ స్పందిస్తూ.. ఈ వాదనకు ఎలాంటి ఆధారాల్లేవని చెప్పారు. తన సోషల్‌మీడియా ఫాలోవర్లతో నిర్వహించిన ‘సండే సంవాద్‌’ కార్యక్రమంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల వైరస్‌ వెలుగు చూసిందనడానికి నిర్దిష్ట ఆధారాలు లేవని, అదే సమయంలో వివిధ దేశాల్లో ఈ వైరస్‌కు సంబంధించిన చికిత్స జరిగినట్లు ఎలాంటి సమాచారం లభించలేదని హర్షవర్దన్‌ అన్నారు. తొలిసారి వైరస్‌ వెలుగుచూసిన కేంద్రంగా వుహాన్‌నే ఇప్పటికీ గుర్తించాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే చైనా నుంచి మార్కెట్లోకి పెద్దఎత్తున వచ్చి పడుతున్న పల్స్‌ ఆక్సీమీటర్లపై ఓ నెటిజన్‌ ప్రశ్నించగా..  ఐఎస్‌వో ముద్ర కలిగిన వాటినే కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచించారు. ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయినంత మాత్రన కొవిడ్‌ లక్షణంగా భావించాల్సిన అవసరం లేదని, ఇతర అనారోగ్య సమస్యలున్నా ఇలా జరుగుతుందని చెప్పారు.

దేశంలో కరోనా వైరస్‌ ఉత్పరివర్తనం జరిగినట్లు గుర్తించలేదని హర్షవర్దన్‌ చెప్పారు. అలాగే ముక్కుద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌ ప్రయోగాలేవీ జరగడం లేదని చెప్పారు. భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లే రాబోయే నెలల్లో రెగ్యులేటరీ ఆమోదానికి రానున్నాయని చెప్పారు. ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ పెద్ద ఎత్తున సుమారు 30వేల నుంచి 40వేల మంది జరపాల్సి ఉంటుందని తెలిపారు.

మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ ‘సామాజిక వ్యాప్తి’ కొన్ని జిల్లాలకే పరిమితం అయిందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి ద్వారా కరోనా విజృంభిస్తోందన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో కొవిడ్‌- 19 సామాజిక వ్యాప్తి దశకు చేరుకున్నట్లు ప్రకటించారు. దీనిపై కేంద్ర మంత్రిని ప్రశ్నించిగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలా జరిగి ఉండోచ్చని ఆయన పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని