శానిటైజర్‌ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం
close

తాజా వార్తలు

Published : 29/07/2020 22:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శానిటైజర్‌ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం

ఇకపై అనుమతి అవసరం లేదు

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి బారి నుంచి తప్పించుకొనేందుకు అవసరమైన అస్త్రాల్లో ముఖ్యమైనది శానిటైజర్‌. కొవిడ్‌-19 అన్‌లాక్‌ సమయంలో వివిధ అవసరాల నిమిత్తం బయటకు రావటం అనివార్యంగా ఉంది. దీనితో చేతులను ఎక్కడైనా శుభ్రం చేసుకునేందుకు వీలు కలిగించే శానిటైజర్‌కు భారీగా డిమాండు ఏర్పడింది. ఈ నేపథ్యంలో శానిటైజర్‌ ద్రావణానికి కొరత ఏర్పడకుండా కేంద్రం కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ద్రావణాన్ని నిల్వ ఉంచేందుకు, విక్రయించేందుకు అనుమతులు అవసరం లేదని ప్రకటించింది. అంతేకాకుండా దేశంలో శానిటైజర్‌ కొరత తలెత్తకుండా ఉండేందుకు కొత్తగా 600 సంస్థలకు తయారీ అనుమతులు మంజూరు చేసింది. అంతేకాకుండా 200 ఎంఎల్‌ ద్రావణం ధర ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.100 కంటే అధికంగా ఉండరాదని స్పష్టం చేసింది.

నిత్యావసర వస్తువుగా మారిన శానిటైజర్‌ విక్రయాలకు లైసెన్సు తప్పనిసరి అనే నిబంధనను సడలించాల్సిందిగా అనేక విజ్ఞప్తులు అందాయని.. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు మరింత అందుబాటులో ఉండేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది. ఈ మేరకు డ్రగ్స్‌ అండ్‌ కాస్మోటిక్స్‌ యాక్ట్‌ నిబంధలను సడలించినట్టు కూడా ఆ శాఖ తెలిపింది. అయితే విక్రేతలు తమ వద్ద గడువు తేదీ దాటిన శానిటైజర్‌ నిల్వలను తమ వద్ద ఉంచుకోరాదని, విక్రయించరాదని ఉత్తర్వులు జారీచేసింది. ఈ వెసులుబాటు వెంటనే అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని