లాక్‌డౌన్‌ పెట్టం.. ఎకానమీ అంతే ముఖ్యం!
close

తాజా వార్తలు

Published : 26/06/2020 21:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ పెట్టం.. ఎకానమీ అంతే ముఖ్యం!

బెంగళూరులో లాక్‌డౌన్‌పై యడియూరప్ప క్లారిటీ

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో కరోనా కేసులు పెరుగుతున్న వేళ అక్కడ మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారంటూ వచ్చిన ఊహాగానాలకు సీఎం యడియూరప్ప తెరదించారు. నగరంలో లాక్‌డౌన్‌ విధించడం లేదని తేల్చి చెప్పారు. బెంగళూరుకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆయన ఈ రోజు సమావేశమై నగరంలో కరోనా పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా  సీఎం మాట్లాడుతూ.. ‘‘బెంగళూరుకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యాను. కరోనా కేసుల పెరుగుదలపై చర్చించాం. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి తమ నియోజకవర్గం పరిధిలో కరోనా కట్టడికి కృషిచేయాలి. బెంగళూరులో లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తేలేదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను మూసి ఉంచాం’’ అని తెలిపారు. కరోనాను కట్టడిచేయడం ఎంత ముఖ్యమో.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కూడా అంతే ముఖ్యమన్నారు. అందరూ సహకరిస్తే వైరస్‌ను కట్టడి చేయవచ్చన్నారు. 

బెంగళూరులో 20 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించాలనీ.. లేకపోతే నగరం మరో బ్రెజిల్‌లా మారుతుందంటూ ఇటీవల జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

మరోవైపు, కర్ణాటకలో నిన్న ఒక్క రోజే 442 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,560కి పెరిగిపోయింది. వీరిలో 6670మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 170మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో  బెంగళూరు నగరంలోనే 78మంది మరణించడం గమనార్హం. బెంగళూరు నగరంలో ఇప్పటివరకు  1791 కేసులు నమోదుకాగా.. వారిలో 505మంది డిశ్చార్జి అయ్యారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని