close

తాజా వార్తలు

Updated : 14/08/2020 12:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

షావోమి నుంచి ఇక ‘ఆండ్రాయిడ్‌ వన్‌’ లేనట్లే!

ఇంటర్నెట్‌డెస్క్‌: షావోమి నుంచి మొబైల్‌ అనగానే తక్కువ ధర, మంచి ఫీచర్లు, ఎంఐయూఐ ముందు గుర్తొస్తాయి. అయితే, ఎలాంటి కస్టమైజ్డ్‌ యూఐ లేకుండా ప్యూర్‌ ఆండ్రాయిడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కావాలనుకునేవారి కోసం షావోమి ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద ‘ఏ’ సిరీస్‌ ఫోన్లను తీసుకొస్తోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఎంఐ ఏ1, ఏ2, ఏ3 ఫోన్లు వచ్చాయి. తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లు కావడంతో యువతలో వీటికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే, ఇకపై ఈ సిరీస్‌లో ఎలాంటి ఎలాంటి ఫోన్లు రావు. ఇటీవలే ఆ కంపెనీ ఈ విషయాన్ని స్పష్టంచేసింది. అంటే ఏ3నే ఈ సిరీస్‌లో చివరి ఫోన్‌ అన్నమాట!

ఈ సిరీస్‌లో ఫోన్లను తీసుకురాకపోవడానికి షావోమి ఎలాంటి కారణాన్ని పేర్కొనలేదు. అయితే, ఈ ఫోన్లకు అప్‌డేట్లు అందించడమొక్కటే ఆ కంపెనీ భారంగా భావిస్తోందని సమాచారం. ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద మూడేళ్ల పాటు అప్‌డేట్స్‌ అందించాల్సి ఉంటుంది. అందుకే ఇకపై ఈ ఫోన్లను తీసుకురాకుండా తన ఆండ్రాయిడ్‌ ఫోన్లను కస్టమైజ్‌ చేసి ఎంఐయూఐతోనే తీసుకురావాలని భావిస్తోంది. తొలుత మోటోరోలా ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద ఫోన్లను తీసుకొచ్చేది. ఆ కంపెనీ ఎప్పుడో దీన్నుంచి తప్పుకుంది. తాజాగా షావోమి కూడా గుడ్‌బై చెప్పేసింది. దీంతో కేవలం నోకియా మాత్రమే ఈ ఫోన్లను ప్రస్తుతం ఉత్పత్తి చేస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.