లేఆఫ్‌లు లేవు..: విప్రో
close

తాజా వార్తలు

Published : 13/07/2020 23:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లేఆఫ్‌లు లేవు..: విప్రో

కొవిడ్‌ కారణంగా చేపట్టే వ్యయ తగ్గింపు చర్యల్లో ఉద్యోగుల తొలగింపు అంశం లేదని టెక్‌ దిగ్గజం విప్రో ఛైర్మన్‌ రషీద్‌ ప్రేమ్‌జీ తెలిపారు. ఆయన సోమవారం కంపెనీ 74వ వార్షిక సమావేశంలో మాట్లాడారు. విప్రో ఇప్పటికే హెచ్‌1బీ వీసా ఇబ్బందుల నుంచి బయటపడిందని తెలిపారు. అమెరికాలో పనిచేసే దాదాపు 70శాతం మంది ఉద్యోగులు స్థానికులే అని తెలిపారు. 
‘‘ కరోనా కారణంగా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదు. అసలు ఉద్యోగులను తొలగించే ఉద్దేశమూ లేదు. మా ఉద్యోగులు ఆఫీస్‌ నుంచి పనిచేస్తారు. కానీ, వచ్చే 12 నుంచి 18 నెలల పాటు అందరూ ఆఫీస్‌కు వచ్చే పరిస్థితి లేదు’’ అని ఆయన ప్రకటించారు. 

ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల్లో 95శాతం మంది వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు.  రషీద్‌ నిర్ణయాలకు చాలా వరకు సానుకూల స్పందన వచ్చింది. తరచూ సీఈవో ఉద్యోగులను మార్చడంపై మాత్రం కొందరు షేర్‌ హోల్డర్లు ప్రశ్నించారు. ఇది కంపెనీ పనితీరుపై ప్రభావం చూపించదా అని ప్రశ్నంచారు.  కొత్త సీఈవోల వేతనాలు పనితీరు ఆధారంగా ఉంటాయని రషీద్‌ వివరించారు.  ఈ ఏజీఎంలో స్వల్ప కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని