ఇంటర్వ్యూ కోసమే.. ఫడణవీస్‌తో భేటీపై రౌత్‌
close

తాజా వార్తలు

Published : 27/09/2020 18:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటర్వ్యూ కోసమే.. ఫడణవీస్‌తో భేటీపై రౌత్‌

ముంబయి: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మధ్య శనివారం జరిగిన రహస్య భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో ఇరు పార్టీ నేతల కలవడం రకరకాల వ్యాఖ్యలకు దారితీసింది. అయితే, శివసేన అధికారిక పత్రికి ‘సామ్నా’ ఇంటర్వ్యూ కోసమే తాను ఫడణవీస్‌ను కలిశానని సంజయ్‌ రౌత్‌ చెప్పారు. ఈ విషయం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు కూడా తెలుసని సంజయ్‌ రౌత్‌ అన్నారు. ‘ఫడణవీస్‌ మాకేం శత్రువు కాదు. మేం ఆయనతో కలిసి పనిచేశాం. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత. ఇంటర్వ్యూ కోసమే ఆయనను కలిశా. ఇది ముందుగా నిర్ణయమైన భేటీ. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు కూడా తెలుసు.  మా మధ్య సైద్ధాంతిక విభేదాలే తప్ప మేమేమీ శత్రువులం కాదు’’ అని పేర్కొన్నారు. ఫడణవీస్‌ను ఇంటర్వ్యూ చేయడం తప్పా అని ప్రశ్నించారు.

సంజయ్‌ రౌత్‌ కేవలం ఇంటర్వ్యూ కోసమే తనను కలిశారని ఫడణవీస్‌ తెలిపారు. తమ మధ్య రాజకీయంగా ఎలాంటి చర్చలూ జరగలేదని స్పష్టంచేశారు. అలాగే, తన అనుమతి లేకుండా ఇంటర్వ్యూలో ఎలాంటి మార్పులూ చేయకూడదని షరతు విధించినట్లు చెప్పారు. 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో శివసేన, భాజపా కలిసి పోటీ చేశాయి. అనంతరం భాజపాను కాదని శివసేన.. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి భాజపా-శివసేన మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రౌత్‌, ఫడణవీస్‌ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని