గ్యాస్‌ సిలిండర్ల ధర తగ్గింది! ఎంతంటే...
close

తాజా వార్తలు

Published : 01/04/2020 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్యాస్‌ సిలిండర్ల ధర తగ్గింది! ఎంతంటే...

దిల్లీ: సబ్సిడీ పరిధిలోకి రాని వంట గ్యాస్‌ సిలెండర్ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు నేడు వెలువడిన ప్రకటన మేరకు దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ ధర రూ.61-65 వరకూ తగ్గనుంది. గృహోపమోగ గ్యాస్‌ ఇంధనం ధర క్షీణించటం ఇటీవలి కాలంలో ఇది రెండవసారి. గత నెలలో కూడా వంట గ్యాస్‌ ధరలు తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, నూతన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్‌ సమాచారం ప్రకారం, సవరించిన ధరల వివరాలు (రూపాయిలలో) ఈ విధంగా ఉన్నాయి.
  నగరం        సవరించిన ధర        పాతధర              
దిల్లీ              744.00        805.50
కోల్‌కతా          774.50        839.50
ముంబయి       714.50        776.50
చెన్నై            761.50        826.00

ప్రతి ఇంటికీ సంవత్సరానికి 14.2 కిలోల బరువున్న 12 సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీ ధరలపై అందచేస్తోంది. ఆపై సిలెండర్లు కావాల్సిన వారు మార్కెట్‌ ధరల ప్రకారం కొనుగోలుచేయాల్సి ఉంది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని