close
Array ( ) 1

తాజా వార్తలు

మళ్లీ ‘శక్తిమాన్‌’

దిల్లీ: ఒకప్పుడు దూరదర్శన్‌లో ప్రసారమైన శక్తిమాన్‌ సిరీస్‌ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. స్పైడర్‌మ్యాన్‌, హిమాన్‌ వంటి విదేశీ సూపర్‌హీరోల జోరులో భారతీయ సూపర్‌హీరోగా ఈ శక్తిమాన్‌ బాగా ప్రాచుర్యం పొందారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ నేపథ్యంలో త్వరలోనే ఆ సిరీస్‌ను పున:ప్రసారం చేయనున్నట్టు సీనియర్‌ నటుడు, శక్తిమాన్‌ పాత్రధారుడు ముఖేష్‌కన్నా తెలిపారు.  ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నాడు దూరదర్శన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన రామాయణం, మహాభారతాలను అలాగే షారుఖ్‌ నటించిన ‘సర్కస్‌’ రజిత్‌కపూర్‌ ‘భ్యోంకేష్‌బక్షి’ వంటి కార్యక్రమాలను పున:ప్రసారం చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్‌ వేళ ఇంట్లోనివారు బయటకు వెళ్లకుండా నాటి క్లాసిక్స్‌ ఆస్వాదిస్తూ కరోనావైరస్‌పై పోరాటం చేద్దామని ఆయన ప్రజలకు సూచించారు. దూరదర్శన్‌లో నాడు 1997 నుంచి 2005వరకు ఈ కార్యక్రమం వివిధ భారతీయ భాషలలో ప్రసారమై పిల్లలకు బాగా చేరువైంది. అయితే పున:ప్రసార తేది వివరాలు మాత్రం తెలియరాలేదు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.