తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
close

తాజా వార్తలు

Updated : 17/06/2020 05:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు


 వారికి భరోసా.. తనకు ఆసరా..

ఈమె పేరు మాధురి. సికింద్రాబాద్‌ పార్శిగుట్టలో నివాసం. కరోనా వేళ చాలా రోజులు ఆటో నడవలేదు. ఫైనాన్స్‌ సంస్థ నుంచి ఒత్తిడి పెరగడంతో ఆటో బయటకు తీయక తప్పలేదు. తనకు, ప్రయాణికులకు మధ్యలో ప్లాస్టిక్‌ షీట్‌ను ఏర్పాటు చేసి బతుకు చక్రాలను ఇలా ముందుకు నడిపిస్తున్నారు.


నగధగలు

నగలతో మగువలు పోటీ పడ్డారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు-10లో  ఓ ఆభరణాల సంస్థ రూపొందించిన సరికొత్త డిజైన్లను పలువురు ముద్దుగుమ్మలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది.

-న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌


గుట్టలు గుట్టలుగా..

హిమయత్‌సాగర్‌ వద్ద ఉన్న సౌడమ్మ తల్లి ఆలయ పరిసరాలు.. మందుబాబులకు అడ్డాగా మారాయి. పవిత్రమైన ప్రాంతంలో తరచూ మద్యం తాగుతుండటంతో ఖాళీ సీసాలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. ఈ సీసాలు, ప్లాస్టిక్‌ గ్లాసులను విక్రయించేందుకు ఓ వృద్ధుడు ఒక్క చోటుకు చేర్చుతూ కనిపించారు.


పాదచారుల పాట్లు

వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులు.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పదో నంబరు ప్లాట్‌ఫాం వద్ద దిగుతున్నారు. సమీపంలోని చిలకలగూడ క్రాస్‌ రోడ్డు వద్ద వారిని ఎక్కించుకునేందుకు ఆటోలు భారీగా చేరుతున్నాయి. తరచూ ట్రాఫిక్‌ స్తంభిస్తుండడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


శిరస్త్రాణమే తలగడగా..

నెక్లెస్‌ రోడ్డులో చిరు వ్యాపారాలు చేసుకునే వారంతా.. ఖాళీ సమయాల్లో సచివాలయం వద్ద డివైడర్‌పై ఇలా విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. కరోనా నేపథ్యంలో ఏదైనా పట్టుకోవాలన్నా, ఎక్కడైనా కూర్చోవాలన్నా.. జనం భయపడుతున్నారు. దీంతో తలను కింద పెట్టకుండా శిరస్త్రాణాన్ని తలగడగా మార్చుకున్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని