close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 05/06/2020 20:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘ఓపి’క ‘చెప్పు’కోవాల్సిందే!

లాక్‌డౌన్‌ సడలింపులతో తిరుపతి రుయా ఆస్పత్రికి రోగుల రాక మొదలైంది. సాధారణ రోజుల్లోనే చాంతాడంత దూరం నిలబడి ఓపీ తీసుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు కరోనాను కట్టడి చేసేందుకు భౌతిక దూరం పాటించేలా వృత్తాలు గీసిన క్యూలైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రయాణ బడలికతో వచ్చిన రోగులు వరుస క్రమంలో నిలబడే ఓపిక లేక ఇలా చెప్పులు పెట్టి, నీడపట్టున వేచి చూస్తున్నారు.


ఏడాది పొడవునా గరళకంఠులమే!

ప్రపంచ పర్యావరణ దినోత్సవమైనా సరే.. ఈ మురికికూపంతో సావాసం చేయాల్సిందే అంటున్నారు దిల్లీలోని తైమూర్‌నగర్‌ వాసులు. దేశ రాజధానిలో అత్యంత చెత్తా చెదారం పోగుపడి ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. 


మాస్కు కడతా.. ఉండమ్మా బొట్టుపెడతా!

కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలు ఏరువాక పౌర్ణమి పూజల్లో పాల్గొన్నారు. మాస్కులు ధరించి, పరిమిత సంఖ్యలో వెళ్లి మర్రిచెట్ల వద్ద పూజలు చేశారు.


రోగులు కాదు.. వైద్య సిబ్బందే!

ఈ చిత్రంలోని వ్యక్తులు పీపీఈ కిట్లు ధరించి నేలపై వాలిపోవడం చూసి కరోనా రోగులుగా భావిస్తే మీరు పొరబడ్డట్లే! వీరు ఇండోనేసియాలోని రియా ప్రావిన్స్‌లోని పనిచేస్తున్న వైద్యసిబ్బంది. రోగుల తాకిడి లేకపోవడంతో అత్యవసర గదుల్లో ఇలా విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు.


కలికితురాయికి మకిలి

పర్యాటకులను కనువిందు చేస్తూ ఆహ్లాదాన్ని పంచే శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు కాలుష్య భూతం ఆవరించి దుర్గంధంతో నిండిపోయింది. పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్న రోజుల్లో ఈ సుందరమైన సరస్సులోని షికారు(పడవ)ల్లో విహరించడం ఓ ప్రత్యేకమైన అనుభూతి కలిగించేంది. వివిధ కారణాలతో అక్కడ పర్యాటకానికి ఆదరణ తగ్గిపోవడంతో ఇలా కళావిహీనంగా మారిపోయింది.


టిక్‌టాక్‌ స్టార్‌.. టిప్‌టాప్‌

టిక్‌టాక్‌ వీడియోలతో ప్రజల అభిమానాన్ని చూరగొని రాజకీయ నాయకురాలిగా మారింది హరియాణాలోని హిసార్‌కు చెందిన సోనాలీ ఫొగాట్‌. గత ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమె శుక్రవారం ఓ ధాన్యం సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. తనను, రైతులను దుర్భషలాడారనే నెపంతో అక్కడి మార్కెటింగ్‌ కమిటీ అధికారి సుల్తాన్‌సింగ్‌పై చేయి చేసుకోవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 


ఒక్కరి కోసం బస్సు.. ఆదాయం తుస్సు

కరోనా నేపథ్యంలో ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్న వారిని మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణాసంస్థ బస్సుల్లో ఎక్కేందుకు అనుమతిస్తోంది. దీంతో గుంటూరు నుంచి తెనాలికి రిజర్వేషన్‌ చేయించుకున్న ఒక వ్యక్తి కోసం బస్సు బయలుదేరి వెళ్లింది. స్పాట్‌ బుకింగ్ లేకపోవడమే ప్రయాణికుల తగ్గుదలకు కారణమని అధికారులు చెబుతున్నారు.


‘నాగేటి సాల్లల్ల నా తెలంగాణ..’

ఏరువాక పౌర్ణమి ఉత్సవంలో భాగంగా సూర్యపేట జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అరక పట్టి దున్నుతున్న రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి.


 విహారం కారాదు.. విషాదం

లాక్‌డౌన్‌ సడలింపులతో కొద్దిరోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు విహారాలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం ఆనకట్ట దిగువన నిత్యం నీరు ప్రవహించే గేట్ల వద్ద కొంతమంది యువకులు జలకాలాడుతున్నారు. మరికొందరు స్వీయ చిత్రాలు తీసుకుంటున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో అకస్మాత్తుగా గేట్లు ఎత్తడంతో నీరు ఉద్ధృతంగా ప్రవహించి పలువురు మృత్యువాతపడిన దాఖాలాలున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం.


ప్రమాదం తెచ్చిన నిరీక్షణ

విశాఖ జిల్లా ఆనందపురం ఫ్లై ఓవర్‌పై ప్రమాదవశాత్తూ వాహనాలు బోల్తాపడ్డాయి. మూడు భారీ వాహనాలు, ఓ ద్విచక్ర వాహనం రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టడంతో వాహనాలు ముందుకు కదిలాయి.


 లాక్‌డౌన్‌ కారణంగా కర్నూలు శివారులోని నగరవనానికి సందర్శకుల తాకిడి లేకపోవడంతో పక్షుల గుంపు ఇలా స్వేచ్ఛగా విహరిస్తూ సేద తీరుతున్నాయి.


తథాగతుడికి మేఘ సందేశం


భాగ్యనగరంలోని ట్యాంక్‌బండ్‌ బుద్ధ విగ్రహం వెనుక ప్రసరించిన నల్లని కారుమబ్బుల కిరణాలు తథాగతుడికి అదనపు వన్నెలద్దాయి. అనంతరం వచ్చిన ఇంద్రధనస్సు మరింత శోభ చేకూర్చింది. 

 


మందుబాబులం.. మేము మందుబాబులం

రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉంటేనే కరోనా కాటు నుంచి బయటపడగలమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా మందుబాబులకు అవేమీ పట్టడంలేదు. మండుటెండను ఖాతరు చేయకుండా, భౌతిక దూరం జాగ్రత్తలను విస్మరించి నెల్లూరు గ్రామీణ మండలం గుండ్లపాలెంలో మద్యం కోసం ఇలా బారులు తీరారు.


 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.