close

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు

జాతి వైరం మాకు లేదు.. ముద్దుముచ్చటకు లోటు లేదు 

శునకాలను చూసి వానరాలు భయపడి పారిపోవడం సాధారణం. అందుకు భిన్నంగా ఓ వానరం శునకంతో ఇలా కోతి వేషాలు వేసింది. దాన్ని ఆపేక్షగా పట్టుకుని కరిచేసింది.. శునకం కూడా అంతే ప్రేమతో కోతి చేష్టలను ఆస్వాదించింది. మహబూబాబాద్‌ జిల్లా కురవిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ దృశ్యం ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కింది. 

న్యూస్‌టుడే, కురవి 


గొర్రె తోక.. మూరెడు

సాధారణంగా గొర్రెల తోక పొడవు బెత్తెడు మాత్రమే ఉంటుంది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లోని మటన్‌ మార్కెట్‌లో ఆదివారం మూరెడు పొడవు తోక ఉన్న ఓ గొర్రె కనిపించింది. స్థానికులు ఈ గొర్రెను ఆసక్తిగా చూశారు. స్థానిక పశువైద్యాధికారి సురేశ్‌ వద్ద ప్రస్తావించగా గొర్రెల్లో అనేక రకాల జాతులుంటాయని, ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి గొర్రెలుంటాయని చెప్పారు. 

- న్యూస్‌టుడే, డోర్నకల్‌  


చలి చీరేస్తోంది

వీరు హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన కూడళ్లలో బుడగలు, బొమ్మలు, ఇతర వస్తువులు అమ్ముకుని జీవనం సాగించే నిరుపేదలు. పగలంతా కార్లు, ఇతర వాహనాల వద్దకు పరుగులు తీసి బొమ్మలు అమ్మే వీరు.. రాత్రి పూట ఇలా పాదచారుల బాటలపైనే నిద్రిస్తున్నారు. తీవ్రమైన చలి, దోమల నుంచి చీరలే వీరికి రక్షణ అయ్యాయి. సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ కూడలి సమీపంలోని పాదచారుల బాటపై కనిపించిన దృశ్యమిది. 

- ఈనాడు, హైదరాబాద్‌  



 

సేవే ఆయన చూపు!

తనకు అంధత్వం ఉన్నా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్‌కు చెందిన సుభాష్‌ గుప్తా. పుట్టుకతోనే అంధుడైన ఆయన 2003లో బ్యాంకు ఉద్యోగం సాధించారు. అంధులు, అనాథలు, పేద విద్యార్థులకు ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో 2004లో ఓ వసతి గృహాన్ని నెలకొల్పారు. అప్పటి నుంచి తన జీతం డబ్బులతో ఆయా విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ప్రస్తుతం 62 మంది ఈ వసతిగృహంలో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ ఆశ్రయం పొంది, చదువుకున్న వారిలో ఇప్పటి వరకు 56 మంది అమ్మాయిలు, 11 మంది అబ్బాయిలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను సాధించారు. తనకు సంతానం లేదని.. వీరినే సొంత పిల్లల్లా చూసుకుంటున్నానని సుభాష్‌ గుప్తా చెప్పారు. 

- ఈనాడు, హైదరాబాద్‌ 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.