అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలి
close

తాజా వార్తలు

Published : 17/08/2020 17:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలి

మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి


 

హైదరాబాద్‌: రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్లు, వంతెనల వివరాలు అంచనావేసి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆ శాఖ శాఖ అధికారులను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. వర్షం కారణంగా నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. పూర్తిస్థాయిలో వాటిని పునరుద్ధరణ చేయడం కోసం ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు సిద్ధం చేయాలన్నారు. అధికారులు 24 గంటలు తమ హెడ్‌ క్వార్టర్‌లో తప్పకుండా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సూచించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న పలు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు సోమవారం పర్యటించారు. కమలాపూర్‌, ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజూరాబాద్‌ మండలాల్లోని ముంపు ప్రాంతాలను మంత్రి ఈటల రాజేందర్‌ స్వయంగా పరిశీలించారు. అదేవిధంగా కరీంనగర్‌లోని 16వ డివిజన్‌ పద్మానగర్‌ ఏరియాలోని లోతట్టు ప్రాంతాలను మంత్రి గంగుల కమలాకర్‌ పరిశీలించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని