చమురు ధరల పోరుకు తెర!
close

తాజా వార్తలు

Updated : 13/04/2020 13:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చమురు ధరల పోరుకు తెర!

భారీగా పుంజుకున్న చమురు మార్కెట్లు

లండన్‌: చమురు విషయంలో సౌదీ అరేబియా, రష్యా మధ్య నెలకొన్న ధరల యుద్ధానికి తెరపడింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో పతనమైన ధరలకు మద్దతునిచ్చేలా చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్‌), రష్యా సహా ఇతర కీలక దేశాల మధ్య ఒప్పందం ఖరారైంది. రోజుకు 9.7 మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకరించారు. తొలుత దీన్ని 10 మిలియన్‌ బ్యారెళ్లుగా నిర్ణయించినప్పటికీ మెక్సికో అంగీకరించకపోవడంతో లక్ష్యాన్ని 9.7 మిలియన్‌ బ్యారెళ్లకు కుదించారు. శుక్రవారమే దీనిపై ఓ అంగీకారానికి వచ్చినప్పటికీ.. మెక్సికో ముందుకురాకపోవడంతో తుది ఒప్పందం ఖరారు చేయడానికి ఆదివారం మరోసారి భేటీ కావాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. ఈ మేరకు ఆయన సౌదీ అరేబియా, రష్యా దేశాధినేతలను అభినందించారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్‌ బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ధరల్ని అదుపులో ఉంచేందుకు ఉత్పత్తిని తగ్గించాలని తొలుత సౌదీ అరేబియా నిర్ణయించింది. కానీ, దీనికి రష్యా అంగీకరించకపోవడంతో ఇరు దేశాల మధ్య ధరల యుద్ధం మొదలైంది. పైగా ధరల పతనం వల్ల ఏర్పడ్డ ఆదాయ లోటును పూడ్చుకునేందుకు పోటీపడి ఉత్పత్తిని పెంచాయి. దీంతో ధరలు భారీ స్థాయిలో పడిపోయాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. 

తాజాగా ఒప్పందం ఖరారుకావడంతో చమురు మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. అమెరికా బెంచ్‌ మార్క్‌ సూచీ డబ్ల్యూటీఐ 7.7 శాతం ఎగబాకి బ్యారెల్‌ ధర 24.52 డాలర్లకు చేరింది. అలాగే బ్రెంట్‌ ధర ఐదు శాతం లాభపడి 33.08డాలర్లకు పెరిగింది.

ఇవీ చదవండి..

భారత వృద్ధి 1.5-2.8 శాతమే

ఐటీ పెద్ద కంపెనీల్లో తొలగింపుల్లేవుTags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని