close

తాజా వార్తలు

గొడ్డలితో బాలుడ్ని బెదిరించిన ఉపాధ్యాయుడు!

సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

శ్రీనగర్‌: విద్యార్థులకు చదువుతో పాటు మంచి నడవడిక నేర్పించడం ఉపాధ్యాయుల విధి. అందులో ఒక్కో ఉపాధ్యాయుడిది ఒక్కో శైలి. అలా విద్యార్థిని తన అదుపులో పెట్టుకోవాలనుకున్న ఓ ఉపాధ్యాయుడు శ్రుతి మించి ప్రవర్తించాడు. విద్యార్థి తన ప్రవర్తన మార్చుకోకపోతే చంపుతానని గొడ్డలిని మెడపై పెట్టి బెదిరించాడు. ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారాలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు, బాలుడు తన ప్రవర్తన మార్చుకోకపోతే చంపుతానని మెడపై గొడ్డలి పెట్టి బెదిరిస్తుండగా, ఆ బాలుడు భయంతో నేలపై పడి ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు అందరూ కళ్లు మూసుకోండి నేనిప్పుడు ఇతడ్ని చంపేస్తున్నానని మిగిలిన విద్యార్థులను ఉద్దేశించి అంటుండగా.. అదేగదిలో స్వెటర్‌లు ధరించిన మరి కొందరు విద్యార్థులు కూర్చొని జరుగుతున్నదంతా చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో చూసిన స్థానికులు, నెటిజన్లు ఆ పైశాచిక ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.