
తాజా వార్తలు
కొవిడ్ వ్యాక్సిన్ లభించేది ఇక్కడే...
ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే వ్యాఖ్య
పుణె: కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం తిరిగినా అది లభించేది మాత్రం పుణెలోనేనని శరద్ పవార్ కుమార్తె, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) పర్యటన సందర్భంగా.. ఆమె ఈ పరోక్ష వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
ఇక్కడి తాలెగావ్ దభాడే పట్టణంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో సుప్రియ మాట్లాడుతూ.. ‘‘ఆయన (మోదీ) పుణెలో పర్యటించారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం తిగినా.. చివరికి కొవిడ్-19 వ్యాక్సిన్ పుణెలోనే లభించనుంది. ఈ నగరం ఎందులోనూ తీసిపోదు. కరోనాకు వ్యాక్సిన్‌ను పుణె వారే కనుగొన్నారు. లేదంటే ఆ ఘనత నాదేనని వేరెవరో చెప్పుకునే వారు’’ అని సుప్రియ చురకలంటించారు. ప్రస్తుతం ఆమె బారామతి లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కరోనా టీకా ‘కొవిషీల్డ్’ను బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయం, ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, దీనిని స్థానికంగా తయారుచేసేందుకు ఎస్ఐఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విధంగా ఉత్పత్తి కానున్న కొవిడ్ టీకాను తొలుత భారత్‌లోనే పంపిణీ చేస్తామని ఆ సంస్థ సీఈఓ అదార్ పూనావాలా పీఎం పర్యటన సందర్భంగా వెల్లడించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
