close

తాజా వార్తలు

Published : 14/07/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజస్థాన్‌ అప్‌డేట్‌: ‘గహ్లోత్‌ వైపు 84 మందే’

జైపుర్‌: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ చెబుతున్నంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు లేదని తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వర్గం పేర్కొంది. కేవలం 84 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఆయనకు ఉందని, మిగిలిన ఎమ్మెల్యేలంతా తమవైపే ఉన్నారని తెలిపింది. పార్టీ అధిష్ఠానంతో తాను ఎలాంటి చర్చలూ జరపట్లేదని పైలట్‌ వెల్లడించారు. అధిష్ఠానం ముందు ఎలాంటి షరతులూ ఉంచలేదని పేర్కొన్నారు. బలప్రదర్శన నిర్వహించాలనుకుంటే అందుకు ముఖ్యమంత్రి నివాసం వేదికకాదని, అసెంబ్లీలో మాత్రమే అది చేపట్టాలని సచిన్‌ అన్నారు. ఒకవేళ తనకు తగిన సంఖ్యాబలం ఉన్నట్లయితే వారితో నేరుగా గవర్నర్‌ను ఎందుకు కలవలేదు? హోటళ్లకు ఎందుకు తరలించారు? అని ప్రశ్నించారు.

సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు నేపథ్యంలో గహ్లోత్‌ నివాసంలో ఇవాళ సీఎల్పీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి 107 మంది హాజరైనట్లు గహ్లోత్‌ వర్గం ప్రకటించింది. సీఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించారు. మరోవైపు ఈ సమావేశానికి 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశానికి ఇద్దరు కేబినెట్‌ మంత్రులు గైర్హాజరవ్వగా.. అందులో ఒకరైన రమేశ్‌ మీనా తాను పైలట్‌ వర్గం వైపు ఉన్నట్లు ప్రకటించారు. దీంతో రాజస్థాన్‌ రాజకీయం రసకందాయంలో పడింది. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని