మద్దతు ధర వ్యవస్థ తప్పక కొనసాగుతుంది: యోగి
close

తాజా వార్తలు

Published : 18/12/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మద్దతు ధర వ్యవస్థ తప్పక కొనసాగుతుంది: యోగి

లఖ్‌నవూ: కేంద్ర వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిపక్షాలు రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. రైతుల పంటలకు ప్రభుత్వం తప్పక కనీస మద్దతు ధరను కల్పిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం బరేలీలో నిర్వహించిన కిసాన్‌ సమ్మేళన్‌ కార్యక్రమంలో మాట్లాడారు. 

‘వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. వ్యవసాయ మార్కెట్లు(మండీలు) ఎట్టి పరిస్థితుల్లోనూ మూతపడవు. రైతుల భూముల్ని ఎవరూ దోచుకోలేరు. నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం రైతులు, గ్రామీణులు, పేదల కోసమే కృషి చేస్తోంది. ఈ చట్టాల ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణ పనులు మొదలయ్యే సరికి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి. ఇక మాట్లాడటానికి వేరే అంశాలు లేక.. ప్రభుత్వంపై కోపాన్ని ఈ విధంగా చూపిస్తున్నాయి’ అని యోగి విమర్శించారు. 

రాష్ట్రంలోని ప్రతిపక్షాల గురించి ప్రస్తావిస్తూ.. ‘ఎస్పీ, బీఎస్పీల హయాంలో రాష్ట్రంలో పలు చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. చెరుకు రైతులకు మేం రూ.1.15లక్షల కోట్ల బకాయిలు చెల్లింపులు చేశాం. ప్రస్తుతం ప్రభుత్వం ఎక్కడ కనీస మద్దతు ధరలు పెంచుతుందేమోనని కొందరు భయాందోళనకు గురవుతున్నారు. అందుకే రైతుల్ని తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్నారు. మా ప్రభుత్వం 86లక్షల మంది రైతులకు, రూ.36వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేసింది’ అని యోగి వెల్లడించారు. 

ఇదీ చదవండి

ts: ఉద్యోగ నియామకాలకు ప్రత్యేక సెల్‌
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని