close

తాజా వార్తలు

Published : 22/05/2020 18:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రోజుకు లక్ష టెస్టులు: ఐసీఎంఆర్‌

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 పరీక్షలను వేగవంతం చేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. రోజుకు లక్ష చొప్పున కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త గంగా ఖేడ్కర్‌ తెలిపారు. గత నాలుగు రోజులుగా రోజుకు లక్ష చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు మొత్తం 27,55,714 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పారు. అందులో 18,287 పరీక్షలు ప్రైవేటు ల్యాబ్‌ల్లో జరిపినట్లు తెలిపారు.

80 శాతం కేసులు 5 రాష్ట్రాల్లోనే

దేశంలో నమోదవుతున్న కొవిడ్‌-19 కేసుల్లో ఎక్కువ శాతం ఐదు రాష్ట్రాల్లో నుంచే వస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం 80 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు తెలిపింది. 60 శాతం కేసులు ఐదు నగరాల నుంచే వస్తున్నాయని కొవిడ్‌-19పై ఏర్పాటు సాధికార కమిటీ-1 ఛైర్మన్‌ వీకే పాల్‌ తెలిపారు. అలాగే దేశంలో మరణాల రేటు కూడా తగ్గిందన్నారు. గతంలో 3.13 శాతంగా ఉన్న ఈ రేటు 3.02 శాతానికి తగ్గిందని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌ 3 నుంచి కేసుల పెరుగుదల తగ్గుతూ వస్తోందన్నారు. ఒకవేళ లాక్‌డౌన్‌ విధించకపోయి ఉంటే కేసుల సంఖ్య భారీ స్థాయిలో ఉండేదన్నారు. మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోందన్నారు. దేశీయంగా డయాగ్నస్టిక్‌ కిట్ల తయారీ వేగవంతమైందని, రాబోయే 6-8 వారాల్లో రోజుకు ఐదు లక్షల కిట్లు తయారు కానున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఐదు కంపెనీలు, సైంటిస్టులు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన