భారత్‌లో కరోనా: 24 గంటల్లో 1990 కేసులు
close

తాజా వార్తలు

Published : 26/04/2020 10:24 IST

భారత్‌లో కరోనా: 24 గంటల్లో 1990 కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1990 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 49మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం 26,496 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 824మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశంలో ఒకే రోజులో ఇంత భారీగా కేసులు పెరగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం మొత్తం బాధితుల్లో 5804 మంది కోలుకోగా మరో 19,868 మంది చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ల నుంచే అత్యధిక కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.

మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికం..

దేశంలో అత్యధికంగా కొవిడ్‌-19 తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7628 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 323మంది మృత్యువాతపడ్డారు. ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 800కేసులు నమోదయ్యాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 13.8శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ వైరస్‌ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. పుణె, నాగ్‌పూర్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. పుణె జిల్లాలో ఇప్పటివరకు 1154 కేసులు నిర్ధారణ కాగా 73 మంది మరణించారు.  

గుజరాత్‌లో 3వేల కేసులు, 133 మంది మృత్యువాత..

మహారాష్ట్ర అనంతరం అత్యధికంగా ఈ కరోనా తీవ్రత గుజరాత్‌లో ఉంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3071కి చేరింది. వీరిలో 133మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే 91 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2036కి చేరగా 99మంది మరణించారు. కేవలం ఒక్క భోపాల్‌లోనే 1176 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని దిల్లోలోనూ కరోనా తీవ్రత పెరుగుతోంది. ఇప్పటివరకు 2625 కేసులు నమోదుకాగా 54మంది మరణించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 31, తెలంగాణలో 26 మరణాలు..
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 1061 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో  171 మంది కోలుకున్నారు. తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 991కి చేరగా 26మంది మరణించినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 280మంది కోలుకున్నారని తెలిపింది.

ఇవీ చదవండి.

కరోనా: బ్రెజిల్‌ లో చేతులెత్తేసిన ఆసుపత్రులు..

ట్రంప్‌ నోటికి తాళం..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని