
తాజా వార్తలు
బండి సంజయ్‌కి మోదీ ఫోన్
గ్రేటర్ ఎన్నికలపై ప్రధాని ఆరా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. గ్రేటర్ ఎన్నికల సరళి, తాజా పరిస్థితులపై ముచ్చటించినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో భాజపా నాయకులు, కార్యకర్తలపై జరిగిన దౌర్జన్యాలపై ప్రధానికి వివరించినట్లు బండి సంజయ్ వివరించారు. ఎన్నికల్లో భాజపాకు విజయాన్ని అందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని.. కొత్త ఉత్సాహంతో పార్టీ కేడర్ నడుచుకోవడంపై మోదీ హర్షం వ్యక్తి చేసినట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని సూచించినట్లు బండి సంజయ్ వెల్లడించారు.
Tags :
జిల్లా వార్తలు