కాసేపట్లో సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ 
close

తాజా వార్తలు

Updated : 27/04/2020 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాసేపట్లో సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ 

దిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత మూడోసారి ఈ రోజు ఉదయం 10గంటలకు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించనున్నారు. కరోనా కట్టడి చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, ఆంక్షలపై కీలకంగా చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేసే అంశంపై సీఎంలతో మాట్లాడే అవకాశం ఉంది. 

మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగించాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి, ఆర్థిక సహకారం తదితర అంశాలను ఈ సందర్భంగా రాష్ట్రాలు లేవనెత్తే అవకాశం ఉంది. దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని, ఈ మేరకు నిబంధనలను రూపొందించాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ  ఇప్పటికే కేంద్రాన్ని కోరిన విషయంతెలిసిందే. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని