‘వారి ఓటు మోదీకే’ 
close

తాజా వార్తలు

Published : 03/11/2020 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వారి ఓటు మోదీకే’ 

చివరి దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని

పట్నా: బిహార్ వాసులు మరోసారి ఎన్డీఏను గెలిపించనున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆ రాష్ట్రంలోని ఫార్బిస్‌గంజ్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ..బిహార్‌ ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. ‘కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ..బిహార్ ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల అంకితభావాన్ని ప్రదర్శించడం గర్వంగా ఉంది. ఎన్నికల నిర్వహణ సక్రమంగా సాగేందుకు నిరంతరాయంగా పనిచేసిన ఎన్నికల సంఘం, భద్రతా బలగాలకు అభినందనలు’ అంటూ ఆయన తన ప్రచార పర్వాన్ని ప్రారంభించారు.

 తమ ప్రభుత్వం గత దశాబ్దకాలంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించిందని, ఈ దశాబ్ద కాలంలో అన్ని వేళలా విద్యుత్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని మోదీ చెప్పారు. ప్రస్తుతం తాము కనీస అవసరాలు తీర్చామని, రానున్న రోజుల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని హామీ ఇచ్చారు. ‘నా మాతృమూర్తులు, సోదరీమణులు ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం  వారికి కనీస సౌకర్యాలు కల్పించినందున వారు మోదీకి ఓటు వేయాలని నిశ్చయించుకున్నారు’ అంటూ మహిళలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తమ ఓటు ద్వారా తమకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకొనే హక్కు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉందన్నారు. 

ఇదిలా ఉండగా..బిహార్‌లో రెండో దశ పోలింగ్ జరుగుతున్న తరుణంలో కొవిడ్ నిబంధనలు పాటించి ఓటు వేయాలని ట్విటర్ వేదికగా మోదీ కోరారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు వేసి, ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని అభ్యర్థించారు. కాగా, ప్రస్తుతం 243 సీట్లకు గానూ..94 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని