మోదీ అసంతృప్తితో ఉన్నారు: ట్రంప్‌ 
close

తాజా వార్తలు

Updated : 29/05/2020 19:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీ అసంతృప్తితో ఉన్నారు: ట్రంప్‌ 

వాషింగ్టన్‌: భారత్‌-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై తాను ప్రధాని మోదీతో మాట్లాడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. చైనా తీరుపై మోదీ అసంతృప్తితో  ఉన్నారని చెప్పుకొచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ భారత్‌-చైనా మధ్య ‘పెద్ద ఘర్షణ’ తలెత్తినట్లు ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌-చైనా మధ్య పెద్ద ఘర్షణ తలెత్తింది. రెండూ చెరో 1.4 బిలియన్‌ జనాభా కలిగిన దేశాలు. అత్యంత శక్తిమంతమైన సైనిక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు చైనాగానీ, అటు భారత్‌గానీ తాజా పరిస్థితులపై సంతోషంగా లేవనుకుంటా’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఈ వివాదంలో ఇతరుల జోక్యం అవసరం లేదని భారత్‌ తేల్చిచెప్పినప్పటికీ.. ఇరు దేశాలు కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్‌ మరోసారి వ్యాఖ్యానించారు. సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి చైనాతో చర్చిస్తున్నట్లు భారత్‌ గురువారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో దేశభద్రత, సార్వభౌమత్వ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని విదేశాంగ శాఖ తెలిపింది. పరోక్షంగా ట్రంప్‌ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తోసిపుచ్చింది. మరోవైపు చైనా సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఇవీ చదవండి..

హాంకాంగ్‌ స్వేచ్ఛకు తూట్లుTags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని