
తాజా వార్తలు
3లక్షల మంది వీధివ్యాపారులకు చేయూత
వర్చువల్‌గా స్వయంగా రుణాలు అందజేయనున్న మోదీ
దిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురైన వీధి వ్యాపారులను కేంద్రం ఆదుకోనుంది. వారిలో 3లక్షల మందికి మంగళవారం వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రుణాలు అందజేయనున్నారు. పీఎం స్వనిధి(ప్రధాన్‌మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి యోజన) పథకం కింద వారికి ఈ ప్రయోజనం చేకూరనుంది. రుణాలు అందజేసిన సమయంలో ప్రధాని వారితో మాట్లాడతారని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, ఈ పథకం కింద వీధి వ్యాపారులు సబ్సిడీ రేటులో రూ.10,000 మూలధనాన్ని పొందవచ్చు. ఈ రుణం కోసం ఉత్తర్ ప్రదేశ్ నుంచి 5,57,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా అత్యధికం కావడం గమనార్హం.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు