రైతు చట్టాలను చదవండి.. షేర్‌ చేయండి
close

తాజా వార్తలు

Published : 19/12/2020 16:20 IST

రైతు చట్టాలను చదవండి.. షేర్‌ చేయండి

ప్రజలను కోరిన ప్రధాని మోదీ

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం విడుదల చేసిన బుక్‌లెట్‌ను చదవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు. కేంద్రం రూపొందించిన ఈ-బుక్‌లెట్‌లో వ్యవసాయ చట్టాల గురించి విస్త్రృత సమాచారం ఉందని, ఆ చట్టాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో గ్రాఫిక్స్‌ రూపంలోనూ తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. నమో యాప్‌లో కూడా బుక్‌లెట్‌ లభ్యమవుతుందన్నారు. అందరూ దీన్ని చదివి షేర్‌ చేయాలని ట్విటర్‌ వేదికగా ప్రజలను కోరారు.

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్న వేళ.. వ్యవసాయ చట్టాలపై కేంద్రం గురువారం బుక్‌లెట్ విడుదల చేసింది. నూతన వ్యవసాయ చట్టాల ద్వారా రైతులు పొందే లాభాలు.. అవి లేకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఈ-బుక్‌లెట్‌లో పేర్కొంది. కొత్త చట్టాల అమలు అనంతరం ఒప్పంద వ్యవసాయం వల్ల లాభపడ్డ రైతుల విజయాలను వివరించింది.

కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసనలు నేటితో 24 రోజులకు చేరాయి. రహదారులనే ఆవాసాలుగా మార్చుకొని రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. కర్షకులతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపినా అవి సఫలం కాలేదు. కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తుండగా, చట్టాల్లో కొన్ని మార్పులు మాత్రమే చేస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది.

ఇవీ చదవండి...

ఆ చట్టాలను రాత్రికి రాత్రే రూపొందించలేదు..

రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని