close

తాజా వార్తలు

Published : 16/07/2020 17:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించేందుకు..

అధికారుల సలహాలు స్వీకరించనున్న ప్రధాని మోదీ

దిల్లీ: కొవిడ్‌-19 కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించేందుకు ప్రధాని నరేంద్రమోదీ చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖల అత్యున్నత అధికారులతో గురువారం సాయంత్రం సమావేశం కానున్నారని తెలిసింది.

గిరాకీ తగ్గిపోవడంతో మందగమనంతో సాగుతున్న ఆర్థిక వ్యవస్థను వేగం పుంజుకొనేలా అవసరమైన సలహాలను మోదీ స్వీకరించనున్నారు. దాదాపు గంటన్నర సేపు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆర్థిక, వాణిజ్య శాఖల అధికారులు ప్రస్తుత పరిస్థితులపై ప్రధానికి ప్రజెంటేషన్స్‌ ఇస్తారని వారు పేర్కొన్నారు. దాదాపు 50 మంది అధికారులు ఇందులో పాల్గొంటారని సమాచారం.

ఇంతకుముందే ఆర్థిక సలహా మండలి, ఆర్థికశాఖ ప్రధాన, ముఖ్య ఆర్థిక సలహాదారు, నీతి ఆయోగ్‌ సభ్యులతో ప్రధాని మోదీ వేర్వేరుగా సమావేశమైన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అమలు చేసిన లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రజల వద్ద నగదు కొరత ఉండటంతో గిరాకీ తగ్గింది. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. దీంతో కేంద్రం రూ.20.97 లక్షల కోట్ల విలువైన ఆర్థిక ఉద్దీపన పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని