close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 16/04/2020 18:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిర్మల-మోదీ సమీక్ష: రెండో ప్యాకేజీకి అవకాశం!

దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 ప్రభావాన్ని ప్రధాని నరేంద్రమోదీ సమీక్షించారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నుంచి విమానయాన రంగం వరకు, నిరుద్యోగం గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన చర్చించారని తెలిసింది. కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న రంగాల కోసం రెండో ఉద్దీపన పథకం ప్రకటించే అవకాశముందని సమాచారం.

వుహాన్‌లో పుట్టిన వైరస్‌తో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సంస్థలు జీడీపీ వృద్ధి అంచనాలను బాగా తగ్గించాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, భవిష్యత్తులో ఏం చేయాలన్న అంశాలపై ప్రధాని చర్చించారని అభిజ్ఞ వర్గాల సమాచారం.

భారత ఆర్థిక వ్యవస్థ 1.5 నుంచి 2.8 శాతం వృద్ధి మాత్రమే నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు ఇప్పటికే అంచనా వేసింది. అదే విధంగా 2020లో జీడీపీ వృద్ధి 1.9 శాతమే ఉండొచ్చని ఐఎంఎఫ్‌ తెలిపింది. మహమ్మారి వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఆతిథ్యం, పౌర విమానయానం, వ్యవసాయం తదితర రంగాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు, పుంజుకొనేలా చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి నేతృత్వంలో ప్రభుత్వం ఒక సాధికార బృందాన్ని ఏర్పాటు చేసింది.

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలు, మధ్యతరగతి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు రూ.1.7 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది. బియ్యం, పప్పులు, నగదు పంపిణీ చేసింది. ఇప్పుడు పరిశ్రమలపై దృష్టి సారించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.