
తాజా వార్తలు
మోదీ రాక: వ్యాక్సిన్ శాస్త్రవేత్తల్లో ‘జోష్’
స్వదేశీ కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిని తెలుసుకున్న ప్రధాని
టీకా పంపిణీకి శాస్త్రవేత్తల నుంచి సూచనలు
అహ్మదాబాద్/హైదరాబాద్/పుణె: కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత్‌లో రూపొందిస్తున్న టీకాలపై ప్రధాని నరేంద్రమోదీ సమీక్ష ముగిసింది. శనివారం ఆయన అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె నగరాల్లో పర్యటించారు. జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్లను సందర్శించి వ్యాక్సిన్ అభివృద్ధి గురించి తెలుసుకున్నారు. సూది మందును త్వరగా విపణిలోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తల్లో ఉత్సాహం నింపారు.
‘కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్న శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ కలిశారు. వారితో ముఖాముఖి చర్చించి ఉత్సాహం నింపారు. టీకాను వేగంగా అభివృద్ధి చేసేందుకు స్ఫూర్తినిచ్చారు. దేశీయ టీకా త్వరితగతిన రూపొందిస్తున్నందుకు మోదీ సంతోషించారు. వ్యాక్సిన్ ప్రయాణంలో భారత్ శాస్త్రీయ పద్ధతులను ఎలా అనుసరిస్తుందో ఆయన మాట్లాడారు. మెరుగైన టీకా పంపిణీ ప్రక్రియ గురించి శాస్త్రవేత్తల నుంచి సలహాలు స్వీకరించారు’ అని ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
టీకాలు కేవలం వ్యక్తిగత ఆరోగ్యం గురించే కాకుండా ప్రపంచ శ్రేయస్సుకూ అవసరమని భారత్ నమ్ముతుందని మోదీ అన్నారని పీఎంవో ప్రకటన తెలిపింది. వైరస్‌పై సమష్టి పోరాటంలో ఇతర, పొరుగు దేశాలనూ పట్టించుకోవడం భారతీయుల విధిగా ఆయన పేర్కొన్నారు. ‘నియంత్రణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు స్వేచ్ఛగా సలహాలు ఇవ్వాలని శాస్త్రవేత్తలను మోదీ కోరారు. కొవిడ్-19తో పోరాడేందుకు కొత్త ఔషధాలను తయారు చేస్తున్న విధానంపై వారు ప్రధానికి ప్రజెంటేషన్ ఇచ్చారు’ అని పీఎంవో తెలిపింది.
‘దేశీయ డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ తయారీ గురించి తెలుసుకొనేందుకు జైడస్ బయోటెక్ పార్క్‌ను సందర్శించాను. వారి శ్రమ, అంకితభావాన్ని అభినందిస్తున్నాను. ఈ ప్రయాణంలో భారత ప్రభుత్వం వారికి అన్ని విధాలా చేయూతనిస్తుంది’ అని అహ్మదాబాద్ పర్యటన తర్వాత మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన పీపీఈ కిట్ ధరించి వ్యాక్సిన్ అభివృద్ధిని పరిశీలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ను సందర్శించారు. సంస్థ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, శాస్త్రవేత్తలతో మాట్లాడారు.
‘హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కేంద్రంలో దేశీయ కొవిడ్-19 టీకా గురించి వివరించారు. ట్రయల్స్‌లో సాధించిన ప్రగతిని అభినందించాను. వేగంగా వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు ఐసీఎంఆర్‌తో కలిసి వారు పనిచేస్తున్నారు’ అని మోదీ ట్వీటారు. తయారీ కేంద్రం నుంచి బయటకు వచ్చాక తన వాహనంలోంచి బయటకువచ్చి మీడియా వారికి, అభిమానులకు అభివాదం చేశారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పుణెకు వెళ్లి సీరమ్ ఇన్స్టిట్యూన్ను సందర్శించారు. అక్కడ సంస్థ ఛైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా, ఆయన కుమారుడు, సీఈవో అధర్ పూనావాలా ప్రధానికి స్వాగతం పలికారు. మోదీ శాస్త్రవేత్తలతో మాట్లాడారు.
‘సీరమ్ ఇన్స్టిట్యూట్లో వ్యాక్సిన్ తయారీ బృందాన్ని కలిశాను. టీకా తయారీలో వారు సాధించిన ప్రగతి గురించి నాకు వివరించారు. వ్యాక్సిన్ ఉత్పత్తి గురించి తెలుసుకున్నా. అంతేకాకుండా తయారీ కేంద్రాన్నీ సందర్శించాను’ అని మోదీ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన పుణె విమానాశ్రయానికి చేరుకొని అక్కడ్నుంచి దిల్లీకి బయల్దేరారని పీఎంవో అధికారులు తెలిపారు. ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్నే సీరమ్ ఉత్పత్తి చేయనున్న సంగతి తెలిసిందే.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
