close

తాజా వార్తలు

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి48

శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ-సి48 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు విరజిమ్ముతూ నింగిలోకి వెళ్లింది. మనదేశానికి చెందిన రీశాట్‌-2బీఆర్‌1తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను ఇది నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టనుంది. అమెరికా 6, ఇజ్రాయెల్‌, ఇటలీ, జపాన్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సి-48 నింగిలోకి మోసుకెళ్లింది. రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహం బరువు 628 కిలోలు. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ రంగాలకు రీశాట్‌ను వినియోగించనున్నారు. రీశాట్‌-2బీకి కొనసాగింపుగా రీశాట్‌-2 బీఆర్‌-1 ప్రయోగం జరిగింది. ఐదేళ్లపాటు రీశాట్‌-2 బీఆర్‌-1 సేవలందించనుంది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.