close

తాజా వార్తలు

Updated : 02/11/2020 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేను రిటైరవుతున్నా: ఆట నుంచి కాదు!

పీవీ సింధు ట్వీట్‌తో గందరగోళం

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిటైరవుతున్నానంటూ ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు సామాజిక మాధ్యమాల్లో చేసిన ఓ ప్రకటన సంచలనం సృష్టించింది. డెన్మార్క్‌ ఓపెన్‌ వరుస దురదృష్టాల్లో ఆఖరిది కావాలి.. నేను రిటైరవుతున్నా అని ఆమె తన అధికారిక ట్విటర్‌, ఇన్‌స్టా ఖాతాల్లో ఓ పోస్ట్‌ పెట్టారు. దీనితో షాక్‌ తిన్న పలువురు అభిమానులు సింధు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో తన ప్రకటన వెనుక ఉన్న అర్థాన్ని సింధు వివరించారు. రిటైర్‌మెంట్‌ ప్రకటన కరోనా వైరస్‌ ప్రభావాన్ని గురించి అని.. తన గురించి కాదని ఆమె స్పష్టం చేశారు. తన పోస్టు పట్ల అభిమానుల ఆందోళనను అర్థం చేసుకోగలనని.. తన ఉద్దేశం తెలుసుకొనేందుకు ఆ పోస్టును పూర్తిగా చదవాల్సిందిగా ఆమె కోరారు. అనంతరం వారు తనకి మద్దతుగా నిలుస్తారనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

అత్యంత కఠినమైన ప్రత్యర్థులను కూడా చివరి వరకు నిలిచి ఎదిరించేలా శిక్షణ పొందానని.. అయితే కనబడకుండా ప్రపంచాన్నంతటినీ వేధిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎలా ఓడించాలని ప్రపంచ ఛాంపియన్‌ సింధు ప్రశ్నించారు. ఇన్ని నెలలు గడుస్తున్నా మనం బయటకు వెళ్లే ప్రతిసారి ప్రశ్నించుకోవాల్సి వస్తోందన్నారు. ఆన్‌లైన్‌లో తాను చదివిన అనేక విషాద ఘటనలు, ఈ ప్రపంచాన్ని గురించి అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయన్న సింధు.. డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత్‌ తరపున ఆడలేకపోవటమే.. ఈ వరుస విషాదాలలో చివరిది కావాలనేది తన పోస్టు ఉద్దేశమని వివరించారు.




Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని