అవన్నీ తప్పుడు వార్తలు: పీవీ సింధు
close

తాజా వార్తలు

Updated : 20/10/2020 22:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవన్నీ తప్పుడు వార్తలు: పీవీ సింధు

నా తల్లిదండ్రులు, కోచ్‌తో ఎలాంటి విభేదాలు లేవు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒలింపిక్స్‌ జాతీయ శిక్షణా శిబిరం నుంచి వైదొలిగి పీవీ సింధు లండన్‌ వెళ్లినట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ప్రకటన చేస్తూ ఆ వార్తలు ప్రచురించిన రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే తన తల్లిదండ్రులు, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌తో తనకు ఎలాంటి విభేదాలూ తలెత్తలేదని స్పష్టం చేసింది. తాను న్యూట్రిషియన్‌, రికవరీ అవసరాల కోసం లండన్‌ వెళ్లినట్లు పేర్కొంది.

‘‘పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికే కొద్దిరోజుల క్రితం నేను లండన్‌కు వచ్చా. నా కుంటుంబ సభ్యుల అనుమతితోనే ఇక్కడి జీఎస్‌ఎస్‌ఐ (గ్యాటోరేడ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌)కు వచ్చా. మా అమ్మా నాన్నతో ఎలాంటి విభేదాలూ లేవు. నా కోసం తమ జీవితాలు త్యాగం చేసిన వారితో నాకెందుకు సమస్యలు ఉంటాయి? రోజూ వాళ్లతో మాట్లాడుతున్నాను. అలాగే నా కోచ్‌ గోపీచంద్‌తో గానీ, ట్రైనింగ్‌ అకాడమీలో గానీ ఎలాంటి సమస్యలూ లేవు. నా గురించి తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాసిన ఆ విలేకరి ఇకపై ఇలాంటి రాతలు ఆపేయాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటా’’ అని సింధు పోస్ట్‌ చేసింది. ఆమె తల్లిదండ్రులు, కోచ్‌ గోపీచంద్‌తో గొడవపడి లండన్‌ వెళ్లినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం రాసిన నేపథ్యంలో సింధు ఈ విధంగా స్పందించింది.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని