‘ఎంత కూల్‌ కెప్టెనో అంత అగ్రెసివ్‌ ప్లేయర్‌’ 
close

తాజా వార్తలు

Published : 17/08/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఎంత కూల్‌ కెప్టెనో అంత అగ్రెసివ్‌ ప్లేయర్‌’ 

భారత క్రికెట్‌ ముఖ చిత్రాన్ని మార్చేశాడు: మిస్బా 

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ బయటకు ఎంత కూల్‌గా ఉంటాడో లోపల అంత అగ్రెసివ్‌గా ఉంటాడని పాకిస్థాన్‌ హెడ్‌ కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌ అన్నాడు. అతడు టీమ్‌ఇండియా ముఖచిత్రాన్నే మార్చేశాడని, తన సారథ్యంలో మూడు ఐసీసీ ట్రోఫీలు దేశానికి అందిచ్చాడని ప్రశంసించాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం మిస్బా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా మాజీ సారథి సేవలను కొనియాడాడు. అతడో విజయవంతమైన సారథి అని, భారత క్రికెట్‌లో గొప్ప ఆటగాడని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాకు ఎంతో చేశాడని, అలాగే జట్టు గమనాన్ని కూడా మార్చాడన్నాడు. 

‘అతడు బయటకి ఎంత కూల్‌గా కనిపిస్తాడో, లోపల అంత అగ్రెసివ్‌ ప్లేయర్‌. అతడు జట్టును నడిపించిన తీరు.. బలోపేతం చేసిన ప్రక్రియ అమోఘం. అలాగే సీనియర్ల నుంచి జూనియర్ల వరకూ అందరినీ సమన్వయం చేసుకుంటూ వచ్చాడు. దాంతో మొత్తం జట్టు స్వరూపమే మారిపోయింది. గంగూలీ ఎక్కడైతే వదిలివెళ్లాడో అక్కడి నుంచే టీమ్‌ఇండియా క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాడు. దాంతో అద్భుతాలు చేశాడు. అతడో గొప్ప వ్యక్తి మాత్రమే కాదు, అద్భుతమైన సారథి కూడా’ అని పాక్‌ కోచ్‌ కొనియాడాడు. కాగా, 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మిస్బా అద్భుత ప్రదర్శన చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో చివర్లో రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేయడమే కాకుండా ఒక దశలో పాకిస్థాన్‌ను గెలిపించేంత పనిచేశాడు. కానీ ధోనీ తెలివిగా ఆలోచించి ఆఖరి ఓవర్‌ను జోగిందర్‌ శర్మకు ఇవ్వడంతో భారత్‌ తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

ఇవీ చదవండి:

నాకు తెలుసు.. కచ్చితంగా కంటతడి పెట్టి ఉంటావని..  

ధోని.. ఎన్నో ఆసక్తికర విశేషాలు

సరిలేరు మహికెవ్వరూ..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని