టెస్టులతోనే కట్టడి సాధ్యం: టాటా గ్రూప్ చైర్మన్‌
close

తాజా వార్తలు

Published : 16/07/2020 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెస్టులతోనే కట్టడి సాధ్యం: టాటా గ్రూప్ చైర్మన్‌

తగినన్ని టెస్టులు చేయకపోతే వైరస్‌ను కట్టడిచేయలేం..
కంపెనీ న్యూస్‌లెటర్‌లో టాటా గ్రూప్ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి ప్రభావంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో సరైన వ్యూహంతో  తగినన్ని కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయకపోతే మహమ్మారిని నియంత్రించలేమని టాటా గ్రూప్ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ప్రతిరోజు పెరుగుతున్న కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పారు. తాజాగా విడుదల చేసిన టాటా గ్రూప్‌ కంపెనీ న్యూస్‌లెటర్‌లో చంద్రశేఖరన్‌ తన అభిప్రాయాలు వెల్లడించారు.

కరోనా వైరస్‌ విస్తృతి పెరుగుతున్న సమయంలో కొవిడ్‌ నిర్ధారణకు కీలకమైన పీసీఆర్‌ కిట్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. వీటికి కావల్సిన కారకాలను కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. శాంపిల్‌ సేకరణ, వాటిని తరలించడం, పరీక్షించేందుకు శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. వీటన్నింటినీ అధిగమించి నిర్ధారణ పరీక్షలు చౌకగా, సులభతరం చేసేందుకు టాటా గ్రూప్‌ ప్రయత్నించినట్లు చైర్మన్‌ చంద్రశేఖరన్‌ వెల్లడించారు. దీనికోసం దేశంలోని అత్యంత అనుభవం ఉన్న నిపుణుల ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనా పైలట్‌ ప్రాజెక్ట్‌ కూడా పూర్తైనట్లు వెల్లడించారు. కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో చేపట్టిన ‘తక్కవ టెస్టులు ఎక్కవ మేధస్సు’ విధానం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. ఆ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఒక్కటీ బయటపడని సమయంలోనే రిస్క్‌ ఎక్కువగా ఉండే ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బందిలో వైరస్‌ వ్యాప్తి ఎలా ఉందో అంచనా వేయడంలో ఈ పద్ధతి ఎంతో దోహదపడిందని చంద్రశేఖరన్‌ వెల్లడించారు. కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహణ వ్యూహాంపై రూపొందించిన ‘ప్రామాణిక నిర్వహణ విధానం’ను ఇప్పటికే జాతీయ ఆరోగ్య సంస్థలకు అందించామని వెల్లడించారు.

గడిచిన ఆరునెలలుగా కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులతో ఎదుర్కొంటున్న అనుభవాలు ఎన్నిచెప్పినా తక్కువే. ఈ కాలంలో తాము ఏకతాటిపై ప్రయాణిస్తూ, సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సహకరించడం, సృజనాత్మక పరిష్కారాల కోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, జాతీయ స్వావలంబన దిశగా అడుగులు వేయడం, కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం వంటి ఎన్నో అనుభవాలు ఉన్నాయని టాటా గ్రూప్ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ వెల్లడించారు. ఇలాంటి సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవడంలో తమ సిబ్బంది చూపించిన చొరవకు గర్వపడుతున్నట్లు టాటా గ్రూప్‌ చీఫ్‌ కంపెనీ న్యూస్‌లెటర్‌లో పేర్కొన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని