పాత నోట్లు పాతిపెట్టి..
close

తాజా వార్తలు

Updated : 12/07/2020 08:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాత నోట్లు పాతిపెట్టి..

కుమార్తె వివాహానికి దాచిన వృద్ధురాలు

చెన్నై, న్యూస్‌టుడే: కుమార్తె వివాహం కోసం దాచిన డబ్బంతా రద్దయిన పాత నోట్లని , అవి చెల్లవని తెలియడంతో ఓ వృద్ధురాలు కన్నీరుమున్నీరయ్యారు. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా కొళ్లిడం సమీపం పట్టియమేడుకు చెందిన రాజదురై కార్మికుడు. ఆయన భార్య ఉష, కుమార్తె విమల బధిరులు. కుమార్తె వివాహం కోసం ఉష కూలి పనులకు వెళ్లి సంపాదించిన నగదును ప్లాస్టిక్‌ సంచిలో పెట్టి ఇంటి వెనుక గుంత తవ్వి పాతిపెట్టారు. సుమారు రూ.35,500 లో పాత రూ.వెయ్యి, రూ.ఐదు వందల నోట్లు ఉన్నాయి. కేంద్రం వీటిని రద్దు చేసిన విషయం ఉషకు తెలియదు. ఇటీవల రాజదురైకి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణ పనుల కోసం కూలీలు తవ్వుతుండగా వారికి ప్లాస్టిక్‌ సంచి లభించింది. దాన్ని చూసిన ఉష అది తన కుమార్తె వివాహం కోసం పొదుపు చేసిన నగదని తెలిపారు. అవన్నీ రద్దయిన నోట్లని చెప్పడంతో ఆమె దిగ్భ్రాంతి చెందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని