close
Array ( ) 1

తాజా వార్తలు

అఫ్గాన్‌లో కూలిన విమానం

కాబూల్‌: అఫ్గాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఘజ్ని ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో 83 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే.. ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. ‘83 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్‌ విమానం ఘజ్ని ప్రావిన్స్‌లోని సడో ఖేల్‌ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల మృతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు’ అని ఘజ్ని గవర్నర్‌ కార్యాలయ అధికార ప్రతినిధి అరిఫ్‌ నూరి తెలిపారు. తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో ఈ విమానం కూలినట్లు తెలుస్తోంది. ఏదైనా సాంకేతిక లోపం వల్ల విమానం కూలిందా లేదా తాలిబన్లు ఈ ఘాతుకానికి తెగబడ్డారా అనే విషయాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. విమానం కూలిన ప్రదేశానికి ప్రత్యేక బలగాలను పంపించినట్లు అధికారులు తెలిపారు. తొలుత కూలిన విమానం అఫ్గాన్‌కు చెందిన అరియానా ఎయిర్‌లైన్స్‌గా వార్తలు వచ్చాయి. కానీ సదరు ఎయిర్‌లైన్స్‌ ఆ వార్తలను ఖండించింది. తమ విమనాలన్నీ బాగానే ఉన్నాయని, దేనికీ ప్రమాదం జరగలేదని తెలిపాయి. ప్రమాదానికి గురైన విమానం జోర్దాన్‌కు చెందినదిగా భావిస్తున్నారు. 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.