close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/07/2020 23:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కారుకు కరోనా ఎఫెక్టు..!

ముంబయి: దేశంలో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు భారీగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే జూన్‌ నెలలో 49.59శాతం పతనమయ్యాయి. గతేడాది జూన్‌లో 2,09,522 వాహనాలను విక్రయించగా.. ఈ సారి మాత్రం కేవలం 1,05,617 వాహనాలను మాత్రమే అమ్మగలిగారు. ముఖ్యంగా కరోనావైరస్‌ విస్తరించడంతో విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా చాలా వ్యాపారాలు మందగించడంతో ఆ ప్రభావం ప్రయాణికుల వాహన విక్రయాలపై పడిందని ఆటోమొబైల్స్‌ సంస్థలకు చెందిన సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానిఫ్యాక్చరర్‌ వెల్లడించింది. 

ఇక ద్విచక్ర వాహనాల విక్రయాలు కూడా 38.56శాతం తగ్గాయి. దీంతో గతేడాది 16,49,475 వాహనాలు అమ్ముడు పోగా.. ఈ సారి అదే నెలలో 10,13,431  మేరకు విక్రయించారు.  వీటిలో మోటార్‌ సైకిళ్ల  విక్రయాలు 10,84,596  నుంచి 7,02,970కు పడిపోయాయి.  ఇక స్కూటర్ల విక్రయాలు 5,12,626 నుంచి 2,69,811కు తగ్గాయి. మొత్తం మీద ఈ రెండు విభాగాల్లో 35, 47శాతం తగ్గుదల కనిపించింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.