అనంతపురం ఆసుపత్రిలో దారుణం
close

తాజా వార్తలు

Published : 25/07/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనంతపురం ఆసుపత్రిలో దారుణం

అనంతపురం: అనంతపురం జిల్లా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే...అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన రాజు శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడటంతో అతని భార్య, కుమార్తె అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తెల్లవారు జామున మూడు గంటలకు ఓపీ రిజిస్టర్‌లో పేరు నమోదు చేయించుకున్నారు. కానీ, ఆసుపత్రి సిబ్బంది మాత్రం వార్డులోకి రానీయలేదు. దీంతో తెల్లవారు జాము నుంచి ఆసుపత్రి ఆవరణలో రోడ్డుపైనే కూర్చుకున్నారు. ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయిన రాజు  ఉదయం మృతి చెందాడు. ఆసుపత్రి సిబ్బందిని ఎంత ప్రాధేయపడినా వారు వైద్యం చేయలేదని మృతుని భార్య కళావతి ఆరోపించారు. సకాలంలో వైద్యం అందించి ఉంటే బతికేవాడని చెబుతున్నారు. కళ్లెదుటే రాజు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మీడియాలో ప్రసారం కావడంతో ఆసుపత్రి సిబ్బంది వచ్చి స్ట్రెచర్‌పై మృతదేహాన్ని మార్చురీ గదికి తరలించారు.

ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి: లోకేశ్‌

అనంతపురం ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘రోడ్డు మీదే ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే వారు లేరా? అని ప్రశ్నించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన ప్రభుత్వ పనితీరుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ధర్మవరం వాసి రాజును కుటుంబ సభ్యులు ఆటోలు ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాపాడాలని 8 గంటలు ప్రాధేయపడినా కనికరం చూపించలేదు. వైద్యం అందక చెట్టుకిందే రాజు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని