
తాజా వార్తలు
కార్మికులు, కూలీలు ఉపాధి కోల్పోయారు: పవన్
అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల కార్మికులు, కూలీలు ఉపాధి కోల్పోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. లాక్డౌన్ కారణంగా ఉద్యాన, ఆక్వా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, కార్మికుల, రైతుల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. మార్కెట్లు మూతపడి అరటి రైతులు చాలా నష్టపోయారని, రైతుల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని పవన్ డిమాండ్ చేశారు.
Tags :
రాజకీయం
జిల్లా వార్తలు